చెరువుల్లో ఇళ్లు.. ముంచెత్తుతున్న వరదలు
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

చెరువుల్లో ఇళ్లు.. ముంచెత్తుతున్న వరదలు

మల్యాల, న్యూస్‌టుడే


మల్యాల చెరువులో చేపట్టిన నిర్మాణాలు

చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతివ్వడం వల్ల నీటి నిలువ సామర్థ్యం తగ్గి భారీ వర్షాలకు మత్తడి నుంచి ప్రవహించే వరద నివాసాలను ముంచెత్తుతోంది. వర్షపు నీరు వెళ్లడానికి పూర్వం నుంచి ఉన్న కాలువలను, ఒర్రెలను ఆక్రమించుకొని వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంవల్లే భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వెళ్లే మార్గంలేక జనావాసాలను ముంచెతున్నాయని నిపుణులు చెబుతున్నారు. భూముల ధరలు ఆకాశాన్నంటడంతో చెరువు మత్తడుల కింద కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టడంవల్ల చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం తగ్గడంతో వరదలు పోటెత్తున్నాయి. కొండగట్టు ప్రాంతంలో కొందరు రియల్‌ వ్యాపారులు, స్థానికులు కాలువలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడంతో వర్షాలకు గుట్టల నుంచి వచ్చే వరద దుకాణాలు, జనావాసాల్లోకి చేరుతుండటంపట్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒర్రెలను ఆక్రమించుకొని కొందరు సాగు చేసుకోవడంవల్ల వరద నీరు పంటను ముంచెత్తుతోంది. మల్యాలలో సూరప్ప చెరువు, మల్యాల చెరువు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం తగ్గడంవల్లే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మత్తడి నుంచి వరద నీరు ఒర్రెగడ్డ ప్రాంతంలోని ఇళ్లల్లోకి చేరడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.


వరద నీటిలో ఎస్సీ కాలనీ, పోచమ్మ వీధి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని