పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లాలో ఈనెల 25న జరిగే ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. అన్ని కేంద్రాల్లో నిరంతరం విద్యుత్తు, మంచినీటి సదుపాయం కల్పించాలన్నారు. ప్రశ్నాపత్రాలను భద్రపరిచేందుకు పోలీసుస్టేషన్లలో తగిన ఏర్పాట్లు చేయాలని పరీక్ష కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసుభద్రత తీసుకోవాలన్నారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో తనిఖీ బృందాలు ఉంటాయని నవంబర్‌ 3 వరకు పరీక్షలు జరగనున్న దృష్ట్యా అన్ని రూట్లలో సమయానికి ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్డీవోలు ఆర్‌.దుర్గామాధురి, టి.వినోద్‌కుమార్‌, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, ఇంటర్‌ నోడల్‌ అధికారి నారాయణ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో 19 వినతులు
జగిత్యాల ఐఎంఏ భవన్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో 19 మంది వినతులు వచ్చాయి. జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని