హంపీలో ఏమి హాయిలే..ఇలా..!
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

హంపీలో ఏమి హాయిలే..ఇలా..!


హంపీ చంద్రశేఖర ఆలయం వద్ద సైకిల్‌యాత్ర చేస్తున్న పాలనాధికారి

అనిరుద్ధ్‌ శ్రవణ్‌, ఉపవిభాగం అధికారి సిద్ధరామేశ్వర తదితరులు

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లా పాలనాధికారి పి.అనిరుద్ధ్‌ శ్రవణ్‌, హొసపేటె ఉపవిభాగం అధికారి సిద్ధరామేశ్వర, పలువురు పర్యాటక శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం సైకిల్‌పై హంపీలో కలియదిరిగారు. సైకిల్‌పై హాయిగా వెళ్లి రావచ్చని చాలా మంది పర్యాటకులు పేర్కొంటున్న నేపథ్యంలో అధికారుల సైకిల్‌ యాత్ర ప్రాముఖ్యం సంతరించుకుంది. కమలాపురలోని పర్యాటక హోటల్‌ మయూర భువనేశ్వరి నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభమైంది. చంద్రశేఖర ఆలయం, అష్టభుజ పుష్కరిణి, గజశాల, హజారరామ ఆలయం, మహానవమి దిబ్బ, రాణి స్నానగృహం గుండా మళ్లీ హోటల్‌కు చేరుకున్నారు. సుమారు 12 కిలోమీటర్లు సైకిల్‌పై తిరిగినట్లు అంచనా. వారి వెంట పర్యాటక శాఖ అధికారి మంజునాథ్‌ గౌడ ఉన్నారు. ‘హంపీలోని ఏ ప్రాంతానికైనా సైకిల్‌పై వెళ్లవచ్చని తెలియవచ్చింది. మంచి అనుభూతి కలిగింది. రాబోయే రోజుల్లో సైకిల్‌పై హంపీ వెళ్లే పర్యాటకులకు ఆ మార్గాల్లో కొన్ని సౌకర్యాలు కల్పించే ఆలోచన ఉందని పాలనాధికారి అనిరుద్ధ్‌ శ్రవణ్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. హంపీ పరిధి సుమారు 42 కిలోమీటర్లుగా పేర్కొంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని