కిత్తూరు వేడుకలకు వేళాయె
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

కిత్తూరు వేడుకలకు వేళాయె

వేడుకల కోసం సర్వాంగ సుందరంగా మారిన బెళగావిలోని ప్రధాన కూడలి

బెళగావి, న్యూస్‌టుడే : బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన కిత్తూరు రాణి చెన్నమ్మ పౌరుషాన్ని నేటి తరానికి పరిచయం చేసే లక్ష్యంతో శనివారం నుంచి రెండు రోజుల కిత్తూరు ఉత్సవాల్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి విడుదల చేసింది. నిధుల కొరత ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా మంత్రి గోవింద కారజోళ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల క్రీడలతో పాటు సాహస క్రీడల్ని కూడా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఉత్సవాల్ని శనివారం ప్రారంభిస్తారు. ఆయన మంత్రివర్గ సహచరులు అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాధారణంగా ఈ ఉత్సవాల్ని జాతీయ స్థాయిలో ఆకర్షించేలా అనేకమంది కళాకారుల్ని ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఆహ్వానించేవారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. కిత్తూరు ఉత్సవాల్ని నిర్వహించడం ఆరంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రజతోత్సవాల్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని