close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని ఇసుల్‌నార్‌- పున్నూర్‌ అటవీ ప్రాంతాల్లో డీఆర్జీ (డిస్ట్రిక్‌ రిజర్వు పోలీసు) జవానులు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. బీజాపూర్‌ ఎస్పీ కమలోచన్‌ కశ్యప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం సమయంలో ఇసుల్‌నార్‌- పున్నూర్‌ అటవీ ప్రాంతాల్లో కొంతమంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, కోబ్రా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు నేరుగా కాల్పులకు దిగడంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. సంఘటనా స్థలం వద్ద ఓ తుపాకి, విప్లవ సాహిత్యం, కిట్‌ బ్యాగులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో కొంతమంది మావోయిస్టులు తప్పించుకుని పోయారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.