నెలకోసారి ఈవీఎం గోదాములు తనిఖీ
logo
Published : 20/06/2021 03:41 IST

నెలకోసారి ఈవీఎం గోదాములు తనిఖీ

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈవో శశాంక్‌ గోయల్‌

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రతి నెలలో ఒకసారి ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యం~రత్రం)లు నిల్వ చేసిన గోదామును తనిఖీ చేయాలని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి శశాంక్‌ గోయల్‌ కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఈవీఎం గోదాముల గోడలను, మూడు నెలలకోసారి గోదాముల్లోని ఈవీఎంలను తనిఖీ చేయాలన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన యువత ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఓటరుగా నమోదైన వారు ఎలక్ట్రానిక్‌ ఓటరు గుర్తింపు కార్డు నేరుగా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. కొత్తగా జారీ అయిన ఎలక్ట్రానిక్‌ ఎపిక్‌ కార్డులను ఎవరికి వారు స్మార్ట్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డుల దరఖాస్తుల పరిశీలన, సవరణలు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ కర్ణన్‌, నగర కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని