Updated : 22/01/2021 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రహదారి భద్రతను పాటిద్దాం

ఆదోని మార్కెట్: పట్టణంలోని ఎన్‌ఎస్‌జే ఫంక్షన్‌ హాలులో 32వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు శుక్రవారం జరిగాయి. వారోత్సవాల్లో డిప్యూటీ కమిషనర్‌ చందర్‌, ఆర్‌డీవో రామకృష్ణా రెడ్డి పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో యాంత్రిక తప్పిదాల కంటే మానవ తప్పిదాల వల్లే రహదారి ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయన్నారు. ఒకరి నిర్లక్ష్యంతో ఎదుటివారి ప్రాణాలను బలి తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రతి ఒక్కరు రహదారి భద్రత సూచీలను పాటిస్తే ప్రమాదాలు జరగవన్నారు. అనంతరం రహదారి సూచీలను వాహన చోదకులకు వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ వినోద్ కుమార్‌, మున్సిపల్ కమిషనర్‌ కృష్ణ, ఉప వైద్యాధికారి రంగనాయక్‌, మోటార్‌ వెహికల్ అధికారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని