Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలి

 సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

అర్పిస్తున్న ఏఐకేఎస్‌సీసీ నాయకులు 

వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: ప్రజలందరూ ఏకమై ప్రధాని మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐకేఎస్‌సీసీ నాయకులు  పిలుపునిచ్చారు. రాజవిహార్‌ కూడలి వద్ద రైతు సంఘం నాయకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి రైతు సంఘం సీనియర్‌ నాయకుడు రామకృష్ణారెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా పోరాడిన గొప్ప నేత సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దుకు నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శేషుఫణి, శివనాగిరెడ్డి, రాముడు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని