
పురపాలక సిబ్బందికి సహకరించాలి
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక సిబ్బందికి ప్రజలు సహకరించి పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దుకుందామని ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించాలన్నారు. మంగళవారం పురపాలక కార్యాలయంలో పట్టణంలోని సచివాలయాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ఎంపీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందించారు. పురపాలక కమిషనర్ వెంకటకృష్ణ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
వెల్దుర్తి, న్యూస్‌టుడే: 44వ నంబరు జాతీయ రహదారిలోని మదార్‌పురం స్టేజీ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. కర్నూలుకు చెందిన హబీబా, నజ్మ ద్విచక్రవాహనంపై డోన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పడంతో కిందపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు.