నిధులున్నా.. నిర్మాణానికి మోక్షం ఎన్నడో.!
eenadu telugu news
Published : 25/10/2021 02:28 IST

నిధులున్నా.. నిర్మాణానికి మోక్షం ఎన్నడో.!

ఇళ్ల లబ్ధిదారుల నిరీక్షణ

శిలాఫలకం

నార్సింగి (చేగుంట), న్యూస్‌టుడే: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా మోక్షం కలగటం లేదు. మండల కేంద్రం నార్సింగిలో ఇళ్ల నిర్మాణానికి 2015లో ఆమోదం లభించింది. ప్రభుత్వం 60 ఇళ్లను మంజూరు చేసింది. ఇందుకుగాను రూ.3.02 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబరు 23న అప్పటి ఎమ్మెల్యే రామలింగారెడ్డి.. వేర్వేరు చోట్ల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. తర్వాత ప్రభుత్వం ఒకే చోట నిర్మిస్తామని చెప్పటంతో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్‌ పడింది. మల్లన్నగుట్ట వద్ద స్థలం నిర్ధారించినా కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు గతేడాది సెప్టెంబరులో మల్లన్నగుట్ట సమీపంలో గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు కనీసం పునాదులూ తీయలేదు. దీంతో శిలాఫలకం సైతం రూపురేఖలు కోల్పోతోంది.
ఎవ్వరూ టెండర్లు వేయడం లేదు
- నర్సింహులు, డీఈఈ, తూప్రాన్‌

టెండర్‌ వేయటానికి ఎవ్వరు ముందుకు రావటంలేదు. దీంతో పనులు ప్రారంభించలేకపోతున్నాం. ఎవ్వరైనా నిర్మించేందుకు ముందుకు వస్తే.. వెంటనే పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని