
రైతులను అసౌకర్యాలకు గురిచేయొద్దు

మద్దిరాల, న్యూస్టుడే: ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులను అసౌకర్యానికి గురిచేయొద్దని జడ్పీటీసీ సభ్యురాలు కన్న సురాంభ అన్నారు. బుధవారం మండలంలోని జీ.కొత్తపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. తూకాలలో మోసాలకు ప్పాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచి బొబ్బిలి నర్సమ్మ, ఏవో దివ్య, ఏపీఎం సైదయ్య పాల్గొన్నారు.
నూతనకల్: నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని తహసీల్దార్ జమీరోద్దిన్ కోరారు. యడవెల్లి, టీక్యాతండాలో ధాన్యం కొనుగోలుకేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.
చివ్వెంల: వాల్యాతండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైబస మండల కన్వీనర్ భూక్యా వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ రౌతు నరసింహారావు ప్రారంభించారు. సర్పంచి ధరావత్ శిరీష, ఏపీఎం వెంకన్న, ఏవో వెంకట్రెడ్డి, పీఏసీఎస్ సభ్యుడు రవీందర్, సైదులు పాల్గొన్నారు.