బ్లాక్‌ఫంగస్‌తో మహిళ మృతి
logo
Published : 18/06/2021 02:58 IST

బ్లాక్‌ఫంగస్‌తో మహిళ మృతి

అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే: బ్లాక్‌ ఫంగస్‌తో మ హిళ మృతిచెందిన ఘటన అడవిదేవులపల్లి మండలం బంగారికుంటతండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగారికుంటతండాకు చెందిన మహిళ(55) ఈ నెల 1న స్థానిక పీహెచ్‌సీలో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 5న ఆమెను కుటుంబ సభ్యులు మిర్యాలగూడలోని ఓ ‌్రప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం 13న హైదరాబాద్‌కు తరలించగా అక్కడ వైద్యులు రోగికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు నిర్ధారించారు. ఈ నెల 14న గాంధీ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని