అర్చకులకు గుర్తింపు కార్డులు అవసరం
eenadu telugu news
Published : 27/07/2021 04:20 IST

అర్చకులకు గుర్తింపు కార్డులు అవసరం


వినతిపత్రం సమర్పిస్తున్న అర్చక సంఘం నాయకులు

నీలగిరి కల్చరల్‌, న్యూస్‌టుడే: దేవాదాయ, ధర్మాదాయ శాఖ గుర్తించి ధూపదీప నైవేద్య పథకం పరిధిలోని ఉమ్మడి జిల్లాలోని 460 ఆలయాలలో పనిచేస్తున్న అర్చకులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సోమవారం సంఘం ఆధ్వర్యంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ మహేంద్రకుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ సహకారంతో పనిచేస్తున్న ఆలయాలకు నిత్యం వెళ్లివచ్చే సందర్భంగా జరిగే అనేక పరిణామాలతో అర్చకులు పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాదు వాసుదేవశర్మ, సలహాదారు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, ఉపాధ్యక్షుడు గుదే లక్ష్మీనర్సయ్యశర్మ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని