భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి: జూలకంటి
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి: జూలకంటి


రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులకు వ్యతిరేకంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్తు సవరణ బిల్లును, నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న నిర్వహించబోయే భారత్‌ను బంద్‌ జయప్రదం చేయాలని మాజీ ఎమ్యెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ ప్రజలకు పిలుపు నిచ్చారు. భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్గొండలోని ఎంవిఎన్‌ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పది నెలల నుంచి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈనెల 21, 22 తేదీలో నియోజకవర్గ స్థాయిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 25, 26 తేదీలలో మండల కేంద్రాలలో ద్విచక్రవాహనాల ర్యాలీలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, మట్ట్టయ్య, సత్యం, సీఎంఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పాలడుగు నాగార్జున, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని