మది నిండుగా.. పూల పండగ
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

మది నిండుగా.. పూల పండగ

నల్గొండ పట్టణంలోని రాక్‌హిల్స్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
● నల్గొండ వివేకానందనగర్‌ కాలనీలోని దేవాలయంలో..

సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు గురువారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబరాల ఆట పాటలతో సందడిగా మారాయి. ఆలయాలు, కాలనీలు, పార్కులు, చౌరస్తాలు ఎక్కడ చూసినా బతుకమ్మల సందడి. పండుగ కోసం పుట్టింటికి చేరిన ఆడపడుచులు బంధుమిత్రులతో కలిసి బతుకమ్మ ఆడటానికి వచ్చిన ప్రతి చోటా పలకరింపులతో సంతోషంగా సాగారు. బతుకమ్మ ఆడేచోట విద్యుత్‌ దీపాల వెలుగులు, మైకులలో పాటలు, కోలాటం ఆటలు, పిల్లల ఆటపాటలు, బతుకమ్మ పాటలతో మారుమోగాయి. రంగుల రంగుల పూల బతుకమ్మలతో ఇంద్రధనన్సు వెలిసినంత అందంగా కనిపించాయి. బతుకమ్మల రంగు, రంగుల పూలకు తోడు పట్టు చీరలతో తరలివచ్చిన అతివల సందడి ఆనందాల హరివిల్లులా మారింది. మహిళలు బతుకమ్మ ఆడటానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా పోలీసులు, పురపాలిక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

- నీలగిరి కల్చరల్‌, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని