ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: కలెక్టర్‌
eenadu telugu news
Published : 19/10/2021 05:06 IST

ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: కలెక్టర్‌

అర్జీదారు నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్న కలెక్టర్‌

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: వివిధ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదులు చేసిన అర్జీదారులకు సంబంధిత శాఖల అధికారులు స్పందించి సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించి అనంతరం అధికారులతో మాట్లాడారు. రెవెన్యూ, భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలకు సంబంధించి 44 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని