డిగ్రీ 3, 5 సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల విడుదల
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

డిగ్రీ 3, 5 సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల విడుదల


ఫలితాలు విడుదల చేస్తున్న ఉపకులపతి నిమ్మ వెంకటరావు, రిజిస్ట్రార్‌ కామరాజు తదితరులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఈ ఏడాది మార్చి నెలలో నిర్వహించిన మూడు, ఐదు సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను ఉపకులపతి నిమ్మ వెంకటరావు, రిజిస్ట్రార్‌ తమ్మినేని కామరాజు మంగళవారం విడుదల చేశారు. మూడో సెమిస్టర్‌కు సంబంధించి అన్ని కోర్సుల్లో మొత్తం 12,426 మంది హాజరు కాగా 5,025 మంది ఉత్తీర్ణులై 40.44 శాతం, ఐదో సెమిస్టర్‌కు 10,905కి గాను 5415 మంది ఉత్తీర్ణులై 49.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా పునర్‌ మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో యూజీ పరీక్షల డీన్‌ ఉదయ్‌భాస్కర్‌, పీజీ పరీక్షల డీన్‌ డా.బిడ్డికి అడ్డయ్య పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని