జడ్పీ పీఠం కేటాయించాలని డిమాండు
eenadu telugu news
Published : 19/09/2021 05:41 IST

జడ్పీ పీఠం కేటాయించాలని డిమాండు


మాట్లాడుతున్న గురునాథ్‌ యాదవ్‌, చిత్రంలో ఇతర నాయకులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: సమాజంలో అన్ని రంగాల్లో వెనుకబడిన యాదవులకు వైకాపా గుర్తింపు ఇచ్చి జడ్పీ ఛైర్మన్‌ పదవిని కేటాయించాలని అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గద్దిబోయిన గురునాథ్‌ యాదవ్‌ డిమాండు చేశారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీకృష్ణమందిరం ఆవరణలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు యాదవులకు జిల్లాలో సరైన రాజకీయ పదవులు ఏ పార్టీ కేటాయించలేదన్నారు. సమావేశంలో యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి పిట్టా భాగ్యచంద్రయాదవ్‌, జిల్లా అధ్యక్షుడు గద్దెబోయిన క్రిష్ణయాదవ్‌, సంఘ నాయకులు నక్క రామన్న యాదవ్‌, దాసరి రాముయాదవ్‌, కలగ కేశవ్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని