గెలిచిన సతులు
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

గెలిచిన సతులు

దువ్వాడ వాణి, టెక్కలి జెడ్పీటీసీ(వైకాపా)

టెక్కలి, న్యూస్‌టుడే : టెక్కలి, నందిగాం జడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన దువ్వాడ వాణి, పేరాడ భార్గవి రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే. టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన దువ్వాడ వాణి 2001లో టెక్కలి జడ్పీటీసీగానే కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలుపొంది రాజకీయ అరంగేట్రం చేశారు. 2006లో ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందగా, 2014లో ఎస్సీ రిజర్వు కావడంతో పోటీ చేయలేదు. తాజా ఎన్నికల్లో ఆమె తమ సమీప ప్రత్యర్థి తెదేపా అభ్యర్థిపై 22,732 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అలాగే 2014 ఎన్నికల్లో పలాస జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన పేరాడ భార్గవి తాజా ఎన్నికల్లో నందిగాం మండలం నుంచి తమ సమీప ప్రత్యర్థి తెదేపా అభ్యర్థిపై 20,000 మెజార్టీతో గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దువ్వాడ వాణి భర్త దువ్వాడ శ్రీనివాస్‌ పార్లమెంటు స్థానానికి, పేరాడ భార్గవి భర్త పేరాడ తిలక్‌ టెక్కలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే ఇద్దరు సతులు గెలుపొందడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పేరాడ భార్గవి, నందిగాం జెడ్పీటీసీ (వైకాపా)


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని