వాగ్వాదాలు.. బహిష్కరణలు
eenadu telugu news
Published : 23/09/2021 05:42 IST

వాగ్వాదాలు.. బహిష్కరణలు

జిల్లాలో ముగిసిన తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం విద్యావిభాగం


పొందూరు ప్రాథమికోన్నత పాఠశాలలో వైకాపా, భాజపా వర్గీయుల మధ్య వాగ్వాదం

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో బుధవారం ఎన్నికల సందడి కనిపించింది. పాఠశాల అభివృద్ధిలో విద్యార్థుల అమ్మానాన్నలను భాగస్వామ్యులను చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల అధికార పార్టీ సానుభూతి పరులు బడుల్లో వాతావరణాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల బహిష్కరించారు. ఫలితంగా పలు బడుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.

జిల్లా వ్యాప్తంగా 3,268 పాఠశాలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 3,152 చోట్ల జరిగాయి. అందులో 2,060 బడుల్లో ఏకగ్రీవంగానే కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. స్థానికంగా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో చాలా చోట్ల తల్లిదండ్రులను ఒప్పించి ప్రక్రియ సజావుగా సాగేలా చూశారు. రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉన్నచోట్ల కొంచెం ఇబ్బందుల తలెత్తాయి. పలు ప్రాంతాల్లో వివాదాలు జరిగి ఎన్నికలు బహిష్కరించారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడితో తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లకపోవడంతో కోరం లేక ప్రక్రియ నిలిపివేశారు.

సీతంపేటలోనే ఎక్కువ...

జిల్లా వ్యాప్తంగా 116 పాఠశాలలకు ఎన్నికలు జరగలేదు. ఇందులో 99 చోట్ల తల్లిదండ్రులు హాజరుకాకపోవడంతో నిలిచిపోయాయి. ఒక్క సీతంపేట మండలంలోనే అత్యధికంగా 21 బడుల్లో జరగలేదు. వీటిలో నాలుగు కోరం లేక వాయిదా పడ్డాయి. 17 బడుల్లో ఉపాధ్యాయులు లేక ఆగిపోయాయి. పొందూరు మండలంలోనూ 18 చోట్ల, ఆమదాలవలసలో 9 చోట్ల కమిటీలను ఎన్నుకోలేదు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని