వంతెన కింద ఇరుక్కుపోయిన లారీ
eenadu telugu news
Published : 26/09/2021 05:53 IST

వంతెన కింద ఇరుక్కుపోయిన లారీ

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : టెక్కలి లోని మెళియాపుట్టి రహదారి కూడలిలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ వంతెన కింద ఓ గ్రానైట్‌ లారీ శనివారం ఇరుక్కుపోయింది. టెక్కలి వైపు గ్రానైట్‌ బ్లాక్‌లతో వస్తూ ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్‌కు కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యాయి. టెక్కలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈవంతెన ఎత్తు తక్కువగా ఉండటం వలన తరచూ ఇక్కడ గ్రానైట్‌ లారీలు చిక్కుకుపోతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని