బకాయిలు వసూలు చేస్తాం: ఈవో
eenadu telugu news
Updated : 28/09/2021 04:45 IST

బకాయిలు వసూలు చేస్తాం: ఈవో

నరసన్నపేట, న్యూస్‌టుడే : నరసన్నపేటలోని శ్రీ వెంకటేశ్వరాలయానికి చెందిన భూముల బకాయిలను త్వరలో వసూలు చేస్తామని గ్రూపు ఆలయాల ఈవో కె.సర్వేశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 24న ‘ఆ దేవుడే దిక్కు’ శీర్షికన ‘ఈనాడు’లో వెలువడిన కథనానికి ఆయన స్పందించారు. నరసన్నపేట వెంకటేశ్వరాలయానికి 121.36 ఎకరాల భూములు జలుమూరు మండలం అందవరం గ్రామాల్లో ఉన్నాయని, ఈ భూములు ఆక్రమణలో ఉండటం వల్ల సర్వే చేసేందుకు రెవెన్యూ శాఖకు కోరినట్టు తెలిపారు. దేవాలయ భూములు కౌలుకు ఇచ్చేందుకు బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించగా, వేలం పాడేందుకు ఎవరూ ముందుకు రానందున వాయిదా వేసినట్టు ఈవో పేర్కొన్నారు. ఆలయానికి సిబ్బంది కొరత ఉన్న మాట నిజమేనని, త్వరలో దేవాలయ భూముల బకాయిలు వసూలు చేస్తామని స్పష్టం చేశారు.


నేటి నుంచి పాలిటెక్నిక్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జి.రాజేశ్వరి తెలిపారు. సోమవారం ఎచ్చెర్లలోని కళాశాలలో ఆమె మాట్లాడుతూ వాస్తవానికి సోమవారం నుంచి ప్రారంభం కావల్సినప్పటికీ భారత్‌ బంద్‌ కారణంగా ఒక రోజు వాయిదా పడినట్లు తెలిపారు. సోమవారం జరగాల్సి ఉన్న పరీక్ష అక్టోబరు 8న జరుగుతుందన్నారు. ఈ మార్పును విద్యార్థులు గమనించాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని