అనుమానాస్పద స్థితిలో లారీడ్రైవరు మృతి
eenadu telugu news
Published : 28/09/2021 04:47 IST

అనుమానాస్పద స్థితిలో లారీడ్రైవరు మృతి


పల్లెటి భాస్కరరావు (దాచిన చిత్రం)

భామిని, న్యూస్‌టుడే: మండలంలోని బాలేరు కూడలి సమీపంలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌.ఎన్‌.పేట మండలం స్కాట్‌పేటకు చెందిన పల్లెటి భాస్కరరావు, అలియాస్‌ అప్పలరాజు (48) తన కుటుంబంతో అయిదేళ్ల కిందట బాలేరు గ్రామానికి బతుకు తెరువు కోసం వచ్చాడు. ఇక్కడి ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ లారీ డ్రైవర్‌గా జీవనం గడుపుతున్నాడు. గత రెండు నెలల నుంచి లారీ పనులు దొరకక ఇంట్లోనే ఖాళీగా ఉంటూ తాగుడుకు బానిసై తరచూ ఇంట్లో వారితో తగదా పడుతుండేవాడు. ఆదివారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అతడు సోమవారం బాలేరు కూడలి సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి చేరిన ఆయన భార్య కుమారి బోరున విలపించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. పాలకొండ ఏరియా ఆసుపత్రికి శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తరలించినట్లు బత్తిలి ఎస్సై డి.అనీల్‌కుమార్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని