ఆరునెలలుగా జీతాల్లేవ్‌..
eenadu telugu news
Published : 28/09/2021 04:47 IST

ఆరునెలలుగా జీతాల్లేవ్‌..


పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేస్తున్న ఆయాలు

పొందూరు, రాజాం గ్రామీణం, సరుబుజ్జిలి : ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు, ఆయాలు ఆరు నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో బకాయిలు వస్తాయన్న ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. విధుల్లో చేరినప్పుడు రూ.6వేలు వేతనాలు ఇస్తామని చెప్పి, ఆ తరువాత కరోనా కారణంగా పాఠశాలలకు సెలవు ఇచ్చినందున ఆయా రోజుల్లో నెలకు రూ.1000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇవ్వకపోతే ఎలా బతికేదని ఆయాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* పాఠశాలల్లో పనిచేసే ఆయాలకు వేతనాలు చెల్లించేందుకు అమ్మఒడి కింద తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసిన మొత్తంలో ఈ ఏడాది రూ.1000 ఉంచి మిగతా రూ.14వేలు జమ చేశారు. పాఠశాలల్లో ఆయాల కోసం జమ చేసిన రూ.60 వేలు నుంచి నెల నెలా రూ.6 వేలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. ఈమేరకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి బ్యాంకుల్లో ఆయాలకు ఖాతాలను తెరిపించింది. ఇంతవరకు బాగానే ఉన్నా డబ్బులు మాత్రం పైసా కూడా వారి ఖాతాల్లో జమ కాలేదు.

ప్రాథమిక పాఠశాలలు : 2,372

ప్రాథమికోన్నత : 413 ఉన్నత : 391

ఆదర్శ : 14 కసూర్బా : 31

వీటిలో పనిచేస్తున్న ఆయాలు : 3,152 మంది

త్వరలో అందిస్తాం: అమ్మఒడి కింద జమ చేసిన రూ.1000 తిరిగి విద్యాశాఖ ఖాతాలో జమ చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెప్పాం. పది రోజుల్లో ఆయా ఖాతాల్లో వేతనాలు జమ చేస్తాం.

-ఎన్‌.వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం


ఎదురుచూస్తున్నాను: ఆరు నెలలుగా పైసా కూడా ఇవ్వలేదు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఈ పనులు చేస్తున్నాం. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నాం. వీటి కోసం ఎదురుచూస్తున్నాం.

- కొబగాన సూరీడు, ఆయా, ప్రాథమికోన్నత పాఠశాల సురవరం, సంతకవిటి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని