‘రైతులకు మరిన్ని సేవలు అందిస్తాం’
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

‘రైతులకు మరిన్ని సేవలు అందిస్తాం’

రాజాం, న్యూస్‌టుడే: మార్కెట్‌ కమిటీల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు ఆ శాఖ సంయుక్త సంచాలకుడు పి.సుధాకర్‌ తెలిపారు. శనివారం రాజాం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో పెట్రోల్‌బంకు ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఏడీ బెవర శ్రీనివాసరావు, కమిటీ కార్యదర్శి పి.శ్రీనివాసరావుతో చర్చించారు. పలు సూచనలు, సలహాలు చేశారు. ఇందులో వైకాపా పట్టణ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని