ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
eenadu telugu news
Published : 26/10/2021 04:21 IST

ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా


కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఎన్‌ఈసీ రీజియన్‌లోని ఆర్టీసీ అధికారులు తమతో బలవంతంగా విధులు చేయించి, శ్రమకు తగిన ఫలితం ఇవ్వకుండా దోపీడీ చేస్తున్నారని వైఎస్‌ఆర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు ఆరోపించారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదనపు డ్యూటీలు వేస్తున్నారని, అధిక పనిగంటలు చేయాల్సి వస్తోందని, కండక్టర్‌ లేకుండా డ్రైవర్‌తోనే బస్సులు నడిపిస్తున్నారని వాపోయారు. మహిళా కండక్టర్లకు రాత్రి 12 గంటల వరకు డ్యూటీలు వేయడం తగదన్నారు. తక్షణం సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఆర్‌.మూర్తి, 9 డిపోల ప్రతినిధులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని