శ్రీశారద రామకృష్ణ సంఘం నిర్వాహకురాలు మృతి
logo
Published : 18/06/2021 03:51 IST

శ్రీశారద రామకృష్ణ సంఘం నిర్వాహకురాలు మృతి

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలిలోని శ్రీశారద రామకృష్ణ సంఘం నిర్వాహకురాలు మాతాజీ త్యాగీశానంద(90) గురువారం కన్నుమూశారు. భీమిలిలో 1940లో ఈ సంఘాన్ని శ్రీఅనుభÅవానంద స్వామి నెలకొల్పి ఆధ్యాత్మిక సేవలను అందించారు. ఈయన తర్వాత శిష్యురాలయిన మాతాజీ త్యాగీశానంద ఈ సంఘ మందిరాన్ని నిర్వహిస్తూ ఏటా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగించారు. ప్రస్తుతం ఈమె స్వస్థలమైన గుంటూరు జిల్లా బాపట్లలో ఉంటూ అక్కడ మృతి చెందారు. ఈమె మృతి పట్ల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు ఆర్‌.సింగరాచార్యులు, హిందూ ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎం.షణ్ముఖరావు, భక్తులు కె.రామకృష్ణ, ఎం.సత్యానందం డా.ఎం.ఆదిత్య తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.్చ
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని