రైతుల సంక్షేమానికి కృషి
logo
Published : 18/06/2021 03:51 IST

రైతుల సంక్షేమానికి కృషి

ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఛైర్మన్‌ బి.సన్నికృష్ణ, కమిటీ సభ్యులు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ద్వారా రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని విశాఖ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన బైగాని సన్నికృష్ణ అన్నారు. గురువారం సాయంత్రం గోపాలపట్నంలోని జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ కార్యాలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు పాపారావు, కాళేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ పి.యువతరెడ్డి, సభ్యులు కె.సుమిత్ర, రమణమ్మ, షేక్‌ అలీమా, బి.నాగమణి, ఈ.హేమ, టి.ప్రసూన, బి.సన్యాసిరావు, ఐ.రవికుమార్‌, సీహెచ్‌.వరలక్ష్మీ, జి.వెంకటసత్యనారాయణరాజు, ఎస్‌.వి.సుబ్బరాజు, పి.వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని