పలువురు న్యాయమూర్తుల బదిలీ
eenadu telugu news
Published : 26/09/2021 03:40 IST

పలువురు న్యాయమూర్తుల బదిలీ

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన పలువురు న్యాయమూర్తులను శనివారం రాష్ట్ర హైకోర్టు బదిలీ చేసింది. ఆరో మెట్రో పాలిటన్‌ న్యాయస్థానం (రైల్వేకోర్టు) న్యాయమూర్తి ఆర్‌.సన్యాసినాయుడు విశాఖలోనే ఏడో అదనపు సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భీమునిపట్నం రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి టి.వి.ఎస్‌.ఎస్‌.ప్రకాష్‌, కృష్ణా జిల్లా విజయవాడ ఒకటో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ న్యాయస్థానానికి బదిలీ అయ్యారు.

* భీమునిపట్నం ప్రధాన జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానం న్యాయమూర్తి పి.విజయ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అదనపు సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కనిగిరి జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి జి.గంగరాజు బదిలీపై అనకాపల్లి సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తిగా వస్తున్నారు.

* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఒకటో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి సిహెచ్‌.యుగంధర్‌, విశాఖ ఒకటో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం న్యాయమూర్తిగా వస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రధాన జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్‌.అరుణశ్రీ, విశాఖ జిల్లా చోడవరం సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తిగా వస్తున్నారు.

* అనకాపల్లి ప్రధాన జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానం న్యాయమూర్తి పి.గోవర్ధన్‌, విశాఖ ప్రధాన జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానం న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ న్యాయమూర్తి కె.వి.ఎల్‌.హిమబిందు, విశాఖ రెండో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం న్యాయమూర్తిగా బదిలీపై వస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని