‘మా గ్రామాల్లో గంజాయి సాగుచేపట్టం’
eenadu telugu news
Published : 19/10/2021 03:39 IST

‘మా గ్రామాల్లో గంజాయి సాగుచేపట్టం’

గుమ్మిరేవుల పంచాయతీ గిరిజనుల తీర్మానం

తీర్మానానికి మద్దతు తెలుపుతున్న గిరిజనులు

సీలేరు, న్యూస్‌టుడే: ‘తెలిసో తెలియక గంజాయి పండించుకుంటున్నాం. గంజాయి వ్యాపారం మాత్రం చేయడం లేదు. మేము పండించే సరకు వివిధ రాష్ట్రాల వారు తీసుకెళ్లి పోలీసులకు పట్టుబడితే మా పేర్లు చెబుతుండటంతో మాపై కేసులు నమోదు చేస్తున్నారు. అందువల్ల ఇకపై గంజాయి సాగు చేపట్టబోమ’ని గుమ్మిరేవుల పంచాయతీ గిరిజనుల తీర్మానం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని ధారకొండ, గుమ్మిరేవుల పంచాయతీల నుంచి కొనుగోలు చేసిన గంజాయి ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో పట్టుబడింది. తాజాగా పోలీసులు రైతులపై కేసులు నమోదు చేస్తుండటంతో దీనిపై ఆందోళన చెందిన గుమ్మిరేవుల పంచాయతీలోని 12 గ్రామాల గిరిజనులు సోమవారం సమావేశమై ఇకపై ఈ సాగు చేపట్టకూడదని నిర్ణయించుకున్నారు. సర్పంచి నైని కమలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ నేత ఎస్‌.విష్ణుమూర్తి, ఉప సర్పంచి జోరంగి వెంకటరావు తదితరులు మాట్లాడారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని