తగ్గిన ‘స్పందన’
eenadu telugu news
Published : 19/10/2021 04:34 IST

తగ్గిన ‘స్పందన’

వినతులు స్వీకరిస్తున్న జేసీలు అరుణ్‌బాబు, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 160 అర్జీలు వచ్చాయి. దసరా కారణంగా ఈ వారం సందర్శకుల రద్దీ కాస్త తగ్గింది. జేసీలు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, పి.అరుణ్‌బాబు, ఇన్‌ఛార్జి డీఆర్వో రంగయ్య, ఆర్డీఓ పెంచల కిషోర్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మల్లికార్జున సెలవులో ఉన్నందున జేసీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గాజువాక, మద్దిలపాలెం, ఆరిలోవ తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు భూ సమస్యలపై వినతులు అందజేశారు.

నిర్ణీత సమయానికి రాకుంటే మెమోలు

ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి నిర్ణీత సమయంలో జిల్లా, మండల స్థాయిలో అధికారులు హాజరు రాకుంటే మెమోలు జారీ చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా అధికారులు ఉదయం 9.30గంటలకు, మండల స్థాయి అధికారులు 10గంటలకు హాజరు కాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో 10గంటల నుంచి 10.30గంటల వరకు స్పందన అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్షిస్తామన్నారు. సోమవారం 11 మంది తహసిల్దార్లు నిర్ణీత సమయానికి రాకపోవడం పట్ల జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది వచ్చినా వీడియో కాన్ఫరెన్స్‌కు అందుబాటులోకి రాలేదన్నారు. వచ్చే వారం నుంచి నిర్ణీత సమయానికి రాకుంటే మెమోలు జారీ చేసి వివరణలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని