Published : 15/05/2021 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ లేకుండా తిరిగే యువకులతో గుంజీలు!

సాలూరు: కరోనా నుంచి రక్షణ పొందేందుకు మాస్క్‌ ధరించడం తప్పనిసరంటూ ప్రభుత్వం పదేపదే చెబుతున్నా వాటిని కొందరు పెడచెవిన పెడుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరులో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న వారికి పురపాలక శాఖ అధికారులు శిక్షలు విధించారు. మాస్క్‌లు లేకుండా నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న యువకులతో గుంజీలు తీయించారు. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించి మాస్క్‌లు అందించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని