క్వారీ లీజులపై విచారణ
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

క్వారీ లీజులపై విచారణ

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో క్వారీ లీజుల మంజూరు వ్యవహారం కలకలం రేపుతోంది. కొన్నింటి మంజూరులో ఉల్లంఘనలు జరిగాయని జిల్లాలో 28, 29 తేదీల్లో విజిలెన్స్‌ విచారణ నిర్వహించనున్నట్లు శాఖావర్గాలు తెలిపాయి. జిల్లాలో మంజూరు చేసిన క్వారీ లీజులు ఎన్ని? వీటిలో ఎన్నింటికి అనుమతులున్నాయి? అనే అంశాలపై ఆరా తీయనున్నారు. జిల్లాలో 307 క్వారీలకు లీజులు ఉన్నాయి. వీటిలో 164 మాత్రమే పనిచేస్తున్నాయి. ఉత్పత్తి నిలిపివేయడం, డెడ్‌రెంట్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ ఛార్జీల పెంపు తదితర కారణాలతో కొన్ని నిర్వహణకు దూరమయ్యాయి. పర్యావరణ అనుమతులు లేకపోవడం వంటి కారణాలున్నాయి. ఇటీవల గనులు, భూగర్భశాఖ జిల్లా సహాయ సంచాలకుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సస్పెండ్‌ కూడా అయ్యారు. దీంతో విచారణకు సిద్ధమవుతున్నారు.

సంవత్సరాల వారీగా మంజూరు చేసిన వాటి వివరాలిలా..

సంవత్సరం  మంజూరు చేసినవి

2016-17  28

2017-18  12

2018-19  12

2019-20  04

2020-21  13


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని