Published : 21/04/2021 02:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శిథిలమవుతున్న రెండు పడకగదుల ఇళ్లు

పంపిణీ కోసం పేదల ఎదురుచూపులు

పర్వతగిరి, న్యూస్‌టుడే


నిరుపయోగంగా ఉన్న భవనాలు

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రెండుపడకగదుల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. పర్వతగిరి మండలం చింతనెక్కొండలో పేదలకు పంపిణీ చేసేందుకు ఏడాది క్రితం 50 రెండు పడకగదుల ఇళ్లను నిర్మించారు. నేటికి ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్ల పంపిణీపై దృష్టి సారించకపోవడంతో ఇళ్లు శిథిలమవుతున్నాయి. గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. స్లాబ్‌ల పెచ్చులు ఊడిపోతున్నాయి. విద్యుత్‌ మీటర్లు, కిటికీలు పగిలిపోతున్నాయి. పైకప్పులపై గుంతలు పడడంతో వర్షపు నీరు నిలిచిపోతోంది. ఇళ్లపై పర్యవేక్షణ కొరవడటంతో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి. మూడేళ్ల క్రితమే పనులను ప్రారంభించినప్పటికీ పలు కారణాలతో ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. నిర్మాణం పూర్తై ఏడాది గడిచినా పంపిణీ చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.


ఎన్నికల కోడ్‌ వల్ల ఆలస్యం..

మహబూబ్‌అలీ, తహసీల్దార్‌, పర్వతగిరి

చింతనెక్కొండలో 50 రెండుపడకగదుల ఇళ్లు నిర్మించారు. త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తాం. మాకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 120 మందిని అర్హులుగా గుర్తించాం. ఇటీవల ఎన్నికల కోడ్‌, రిజిస్ట్రేషన్ల పనులతో పంపిణీలో జాప్యం జరిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని