Published : 21/04/2021 02:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీకాకు కదిలొస్తూ..

పరకాల, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ టీకాల నిల్వలు నిండుకున్నాయి. సోమవారం వచ్చిన వాటితో మంగళవారం వరకు పూర్తికాగా మరిన్ని రానున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ కేసుల పెరుగుదలతో చాలా మంది టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కరోనా కట్టడికి వినియోగంలోకి వచ్చిన వ్యాక్సిన్‌ను జనవరి 16 నుంచి జిల్లాలో ప్రారంభించారు. ప్రస్తుతం మూడు సీహెచ్‌సీలు, 17 పీహెచ్‌సీలు, పరకాలలోని లలితా నర్సింగ్‌ హోం(ప్రైవేటు)లో టీకాలను ఇస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందుతున్నాయి. రెండు వారాల నుంచి కేసులు అధికమవుతుండటం, టీకాల ప్రాముఖ్యంపై ప్రచారం జరగడంతో సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో బారులు దీరుతున్నారు. జనం తాకిడి ఎక్కువ కావడంతో ఆయా చోట్ల సమస్యలు సైతం ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పరకాలలో వసతుల కొరత ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒకే చోట ఓవైపు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, మరోవైపు టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సరిపడ గదులు లేకపోవడమే అందుకు కారణమవ్వగా పాలకులు, అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.


పరకాలలో టీకాల కోసం వచ్చిన ప్రజలు

రెండు రోజుల కిందటే నిండుకున్న నిల్వలు

టీకా కోసం ఎక్కువ మంది వస్తుండటంతో నిల్వలు నిండుకున్నాయి. సోమవారం 1, 500 డోస్‌లు ఇవ్వడంతో వాటినే సీహెచ్‌సీ, పీహెచ్‌సీలకు కేటాయించారు. వాటినే మంగళవారం పంపిణీ చేశారు. మంగళవారం సాయంత్రం తరువాత జిల్లాకు నిల్వలు వస్తాయని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. సకాలంలో టీకాలు వస్తేనే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. బుధవారం ఉదయం నాటికి ఆసుపత్రులకు చేరేవిధంగా అధికారులు చర్యలు తీసకుంటున్నారు. వరుసగా టీకాలు ఇచ్చి ఒక్కసారిగా నిలిపివేస్తే జనాల నుంచి వ్యతిరేకత వస్తుందని, గొడవ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.


వ్యాక్సిన్లు రానున్నాయి..

- చల్లా మధుసూదన్‌, డీఎంహెచ్‌వో

జిల్లాలో కొవిడ్‌ టీకాలు నిండుకున్నది వాస్తవమే. ఆయా చోట్ల ఉన్న టీకాలతో మంగళవారం వరకు అన్ని చోట్లకు పంపిణీ చేశార. మంగళవారం రాత్రి వరకు జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి. బుధవారం యథావిధిగా టీకాలు వేసేందుకు చర్యలు తీసుకుంటాం

గత వారం రోజుల్లో జిల్లాలో వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి వివరాలు

తేదీ   మొదటి డోస్‌

11  581

12  1,041

13  63

14   1,360

15  1,949

16  1,900

17  1,900

19  2,426


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని