Published : 21/04/2021 02:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మొదలైన రాత్రి కర్ఫ్యూ


పరకాలలో నిర్మానుష్యంగా బస్‌స్టేషన్‌ ఏరియా

పరకాల, న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ విలయతాండవంతో జిల్లాలో రాత్రి కర్ఫ్యూ మంగళవారం నుంచి మొదలైంది. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో రాత్రి 8 గంటల వరకే వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, పాన్‌ షాపులు, పండ్ల దుకాణాలు మూసేశారు. కర్ఫ్యూ గురించి మధ్యాహ్నం నుంచే వివిధ శాఖల అధికారులు ప్రచారం చేయడం, పోలీసులు వీధుల్లో తిరిగి చెప్పడంతో రాత్రి 9 గంటలకు పట్టణాలు బోసిపోయాయి. ఆసుపత్రులు, మందుల దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయి. రాత్రి పరకాలలో ఏసీపీ శ్రీనివాస్‌ స్థానిక సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు ప్రశాంత్‌బాబు, శ్రీకాంత్‌కు కర్ఫ్యూపై పలు సూచనలు చేశారు.


నర్సంపేటలో గస్తీ చేస్తున్న డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, సీఐ సతీశ్‌బాబు, ఎస్సై పోలీసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని