Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రహదారి ప్రమాదాలు అరికట్టండి


మాట్లాడుతున్న కలెక్టర్‌ కృష్ణఆదిత్య చిత్రంలో డీఎస్పీలు కిషన్‌, సంపత్‌రావు, జిల్లా రవాణాధికారి వేణు తదితరులు

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదాలు సంయుక్తంగా అరికట్టాలని కలెక్టర్‌ కృష్ణఆదిత్య రవాణా, పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం సింగరేణి ఇల్లందుక్లబ్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు, వాటి నివారణకు రవాణా శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలను జిల్లా రవాణాధికారి వేణు, పోలీసు శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలపై భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, కిషన్‌ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏడాది కాలంలో రేగొండ నుంచి మహదేవ్‌పూర్‌ వరకు కేవలం 70 కిలోమీటర్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 70 మంది చనిపోయారని, ముఖ్యంగా ఎలాంటి అభంశుభం తెలియని ఐదు సంవత్సరాల చిన్నారి ఇసుక లారీ ఢీకొట్టడంంతో చనిపోవడం అందరినీ కలిచివేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రత నియమాలను కఠినంగా అమలు చేయాలన్నారు. ఇసుక లారీలు నిర్ణీత సమయంలోనే తిరిగేలా చూడాలన్నారు. ప్రతి ఇసుక లారీపై ఓనర్‌, డ్రైవర్‌, క్లీనర్ల వివరాలు ప్రదర్శించాలని, అలాగే డ్రెస్‌ కోడ్‌ కచ్చింతగా అమలు చేయాలన్నారు. సింగరేణి, జెన్‌కో బొగ్గు లారీల్లో స్పీడ్‌ కంట్రోల్‌ డివైజ్‌లు అమర్చాలన్నారు. తరచూ తనిఖీలు నిర్వహించేందుకు అవసరమైన తాత్కాలిక సిబ్బందిని అదనంగా 30 మందిని నియమించుకోవాలన్నారు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఎండీసీ పీవో రవి, ఎంవీఐలు శ్రీనివాస్‌, సంధాని, కాటారం, రేగొండ, ఎస్సైలు సాంబమూర్తి, కృష్ణప్రసాద్‌, లారీ ఓనర్స్‌, ఆర్టీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని