Updated : 14/01/2020 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రామద్వీప్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

దెందులూరు: దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో గ్రామద్వీప్ ఆధ్వర్యంలో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, కోలాట నృత్యాలు, విచిత్ర వేషధారణలు, యువకుల నృత్యాలతో అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన యువతీయువకులు సంక్రాంతి వేడుకలను ఆసక్తిగా తిలకించారు. మొదటి సారిగా గ్రామస్థులతో కలిసి పండుగ చేసుకోవటం చూస్తున్నామనీ.. ఇటువంటి పండుగ ద్వారా ప్రజల మధ్య ఐక్యమత్యం పెరుగుతుందన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే వేడుకలు ప్రారంభం కాగా.. 10 గంటల వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో  గ్రామద్వీప్‌ స్వచ్ఛంద సంస్థ ముఖ్య పోషకురాలు డా.వెలమాటి మనోహరి, ఉష గ్రూప్ సంస్థల అధినేత డా.వీవీ బాలకృష్ణ రావు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని