అత్తను చూసేందుకు వెళ్లి అనంతలోకాలకు..
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్తను చూసేందుకు వెళ్లి అనంతలోకాలకు..

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మీ అమ్మను చూసి వస్తానని భార్యతో చెప్పి అత్తింటికి వెళ్లిన వ్యక్తిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. అతడి రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఇల్లాలికి భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలియడంతో గుండె ఆగినంత పనైంది. వివరాల్లోకి వెళ్తే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన పిగ్గిళి దుర్గారావు(45) మృతి చెందారు. మరో వ్యక్తి కామినేని నరసింహారావు గాయపడ్డాడు. ఎస్సై రామ్మూర్తి కథనం ప్రకారం.. దుర్గారావు తన స్నేహితుడైన కామినేని నరసింహారావుతో కలసి దమ్మపేట మండలం మందలపల్లిలోని అత్తగారింటికి వెళ్లారు. తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా నారంవారిగూడెం కాలనీ సమీపంలో లారీ వీరిని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కరోనా నేపథ్యంలో వారి వద్దకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సమాచారం తెలుసుకున్న గ్రామ ఉపసర్పంచి సురేశ్‌నాయుడు క్షతగాత్రుల వద్దకు వెళ్లి అంబులెన్సును పిలిపించి అశ్వారావుపేట ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దుర్గారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. నరసింహారావుకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని