క్యూ హబ్‌ ప్రారంభం నేడు
eenadu telugu news
Published : 20/10/2021 02:11 IST

క్యూ హబ్‌ ప్రారంభం నేడు

యువ ఆవిష్కర్తల వెన్ను తట్టేందుకు ఏర్పాటు

రాయదుర్గం, న్యూస్‌టుడే: గౌలిదొడ్డిలోని క్యూ సిటీ ఐటీ పార్కులో క్యూ హబ్‌ పేరుతో ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని బుధవారం ఆరంభిస్తున్నారు. క్యూ సిటీ యాజమాన్యం ఈ కేంద్రానికి శ్రీకారం చుడుతోంది. సరికొత్త ఆలోచనలతో వచ్చే యువత తమ ఆవిష్కరణలకు రూపమిచ్చేందుకు ఈ కేంద్రం వేదికగా నిలువనుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో అంతర్జాలం సహా అన్ని వసతులూ ఉచితంగా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘కోడ్‌ థాన్‌ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చే యువతకు కేంద్రంలో మెంటార్ల సహాయం, పెట్టుబడుల విషయంలో సహకారం అందిస్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని