close

బుధవారం, జులై 24, 2019

ప్రధానాంశాలు

ఈశ్వరయ్య ఆర్ట్‌ గ్యాలరీ ప్రారంభం

వెంగళ్‌రావునగర్‌, న్యూస్‌టుడే: వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధి మధురానగర్‌ హెచ్‌-బ్లాక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఈశ్వరయ్య’ ఆర్ట్‌ గ్యాలరీని సోమవారం ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి తన మేధాశక్తితో ప్రగతిని సాధిస్తారని పేర్కొన్నారు. ఈశ్వరయ్య ఆర్ట్‌ గ్యాలరీ వర్థమాన కళాకారులకు దోహదపడుతుందన్నారు. ఈశ్వరయ్య చిత్రాలు, అందించిన సేవలపై స్ఫూర్తి పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా రమణాచారి ఆవిష్కరించారు. అనంతరం సీనియర్‌ ఆర్టిస్టులు బి.ఎ.రెడ్డి, సుభాష్‌బాబు, నారప్పలను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ ఫైన్‌ ఆర్ట్‌ కళాశాల డైరెక్టర్‌ అజిత సురభి, డైరెక్టర్‌ సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.