close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

ఇక సాఫీగా కరెంటు సరఫరా

విద్యుత్తు అంతరాయానికి పరిష్కారం

● రూ. 1.20 కోట్లతో కొత్త  ఉపకేంద్రం పూర్తి

● మరో రెండింటికి ప్రతిపాదనలు


డీ1 పాత ఉపకేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పరికరాలు ఇవే

 

చిన్నగాలి వీచినా... వర్షం కురిసినా నగరంలో విద్యుత్తు సరఫరా నిలిపి వేస్తారు..ఇక వర్షాకాలంలో సరఫరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..కారణం విద్యుత్తు ఉపకేంద్రాలలో సమస్యలుండడం..కండక్టరు సరిగా లేకపోవడయే.. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పరికరాలు కావడంతో తరచూ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. నగరంలో విద్యుత్తు కనెక్షన్లు విపరీతంగా పెరిగిపోవడం, ఉన్న విద్యుత్తు ఉప కేంద్రాలపై అధికభారం పడడంతో తరచూ సరఫరా నిలిచిపోతుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్తు శాఖ అధికారులు దృష్టి సారించారు. ఇక విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ఉంటుందని ఆ శాఖాధికారులు భరోసా ఇస్తున్నారు.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

 

రూ. 1.20 కోట్లతో ఆధునికీకరణ

నగరంలోని డీ3 సబ్‌ష్టేషన్‌ పరిధిలో దుబ్బా, ఆదర్శనగర్‌, ఎన్‌జీవోస్‌ కాలనీలు ఉన్నాయి. ఇటీవల ఇదే సబ్‌ష్టేషన్‌ పరిధిలో కొత్త కలెక్టరేట్‌ నిర్మించడంతో పాటు రెండు పడకల ఇళ్లు, భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మించడంతో వీటన్నింటికి డీ3 నుంచి విద్యుత్తు సరఫరా చేయడం కష్టంగా ఉంటోంది. ఎట్టకేలకు అధికారులు కొత్త సబ్‌ష్టేషన్‌ నిర్మాణంపై దృష్టిసారించారు. రూ. 1.20 కోట్లతో ఎట్టకేలకు సబ్‌స్టేషన్‌ పనులు పూర్తి చేశారు. కొత్త సబ్‌ష్టేషన్‌తో డీ3 సబ్‌స్టేషన్‌పై భారం పడే అవకాశం లేకుండా పోయింది.


ఆధునికీకరణ పూర్తయిన పవర్‌హౌజ్‌ వద్ద ఉన్న విద్యుత్తు ఉప కేంద్రం

మరో రెండు విద్యుత్తు ఉపకేంద్రాలు

నగరంలో వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్తు సరఫరా చేయాలంటే మరో రెండు సబ్‌స్టేషన్లు అవసరం. ఒకటి న్యాల్‌కల్‌ రోడ్డులో, మరొకటి నాగారం ప్రాంతంలో. ఈ రెండింటికి ఇప్పటికే విద్యుత్తు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వ స్థలం కేటాయింపు విషయంలో జాప్యంతో పనులు ముందుకు సాగడం లేదు.

ఇబ్బందులకు దూరం

ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సబ్‌ష్టేషన్లు కావడంతో తరచు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల సబ్‌స్టేషన్ల ఆధునికీకరణపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని పవర్‌హౌజ్‌ వద్ద ఉన్న డీ1 సబ్‌స్టేషన్‌లో, దబ్బా వద్ద ఉన్న డీ3 సబ్‌స్టేషన్‌లో పాత పరికరాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. అధికారులు స్పందించి మిగిలిన సబ్‌ష్టేషన్లు, వేలాడుతున్న విద్యుత్తు తీగలను, ప్రమాదకరమైన స్తంభాలను సైతం తొలగిస్తే నగరంలో విద్యుత్తు సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉంది.


కొత్త కలెక్టరేట్‌ వద్ద నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రం ఇది

దశల వారీగా పనులు..

నగరంలో ఏళ్లక్రితం ఉన్న సబ్‌స్టేషన్లు కావడంతో సమస్య వస్తోంది. పరికరాలను పూర్తిగా తొలగించి కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే డీ1, డీ3 పూర్తి చేశాం. మిగిలిన వాటిని సైతం దశలవారీగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశాం. వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు సరఫరా చేసేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నాం.

-సుదర్శన్‌, ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.