విద్యార్థినులు చట్టాలను తెలుసుకోవాలి - Nizamabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

విద్యార్థినులు చట్టాలను తెలుసుకోవాలి

మాట్లాడుతున్న న్యాయసేవా సంస్థ కార్యదర్శి కిరణ్మయి

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్మయి అన్నారు. మంగళవారం కోటగల్లిలోని మహిళా కళాశాలలో జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉంటే ఇబ్బందులను అధిగమించడానికి వీలుంటుందన్నారు. మహిళా చట్టాలు, ర్యాగింగ్‌ చట్టాలను వివరించారు. ఈ చట్టాలు తెలుసుకొంటే ధైర్యం వస్తుందన్నారు. రాజ్‌కుమార్‌ సుబేదార్‌ పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ లావణ్య, నాగేందర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.