చిన్న వివాదం.. చివరికి అంతం..!  - Hyderabad - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

చిన్న వివాదం.. చివరికి అంతం..! 

కుటుంబ సభ్యులపై పోలీసుల అనుమానం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఖైరతాబాద్‌లోని ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన ఆదివారం సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం జీనుగుపల్లికి చెందిన నేనావత్‌ బంగారి (56) ఉపాధి కోసం నగరానికి వచ్చి ఖైరతాబాద్‌లోని మహాభారత్‌ నగర్‌లో ఉంటున్నాడు. శనివారం రాత్రి బంగారి అతని భార్య చాందీకి, బంగారి చెల్లెలి మధ్య గొడవ జరిగింది. తన చెల్లెలితో ఎందుకు గొడవ పడుతున్నావని బంగారి ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం చాందీ తమ బంధువుల ఇంటికెళ్లగా, బంగారి బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. ఆదివారం ఉదయం మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు మెట్రో పిల్లర్లు 1125- 1126 మధ్య విభాగినిపై తీవ్ర గాయాలతో, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కనిపించాడు. స్థానికులు గమనించగా చనిపోయి ఉన్నాడు. పోలీసులకు మాజీ కార్పొరేటర్‌ ఎస్‌.కె.షరీఫ్‌ సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ చింతల సైదిరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ చేరుకుని వివరాలు సేకరించింది. సెంట్రల్‌ జోన్‌ అదనపు డీసీపీ జంగారెడ్డి, అబిడ్స్‌ ఏసీపీ బిక్షంరెడ్డి ఘటనా స్థలంతో పాటు బంగారి ఇంటిని పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.