close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఆకట్టుకున్న బొబ్బిలి యుద్ధం బుర్రకథా గానం

వివేక్‌నగర్‌, న్యూస్‌టుడే: త్యాగరాయ గానసభ కళాదీక్షితులు వేదికలో బుధవారం ప్రముఖ బుర్రకథా కళాకారులు గంధం వెంకటేశం, రమేశ్‌, గంగన్న బృందం ప్రదర్శించిన ‘బొబ్బిలి యుద్ధం’ బుర్రకథాగానం ఆసాంతం ప్రేక్షక రంజకంగా సాగింది. సుద్దాల హనుమంతు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న బుర్రకథ సప్తాహంలో భాగంగా ఈ కథాగానం సాగింది. ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ బుద్ధా మురళి, అతిథులుగా వివిధ రంగాల ప్రముఖులు డా.వకులాభరణం కృష్ణమోహన్‌రావు, వై.రాజేంద్రప్రసాద్‌, డా.కొత్త కృష్ణవేణి, కొత్త శ్రీనివాస్‌, యేబూషి యాదగిరి, లక్కరాజు నిర్మల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గంధం వెంకటేశం, రమేశ్‌, గంగన్నలను సత్కరించారు. సుద్దాల హనుమంతు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బుర్రకథ కళారూపాన్ని ఆదరించి కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి పర్యవేక్షణ చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.