close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

రహదారులు సుందరం..కావాలి వేగిరం

పలు డివిజన్లలో మట్టి రోడ్ల స్థానంలో సీసీ
రూ.347.23 కోట్లతో కొనసాగుతున్న పనులు
త్వరగా పూర్తిచేస్తే సమస్యలు దూరం

గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి.. మూడు విడతలుగా మంజూరైన నిధులతో కొన్నిచోట్ల పూర్తి కాగా, మరికొన్ని ప్రాంతాల్లో పనులు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే నగరవాసులకు  సౌకర్యవôతంగా మారనుంది.

న్యూస్‌టుడే-కార్పొరేషన్‌(కరీంనగర్‌)

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన, అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, కల్వర్టుల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. నగర పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మొదటి విడతలో రూ.100 కోట్లు, రెండో విడతలో రూ.147.23 కోట్లు, మూడో విడతలో రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచి చకచకా పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. మొత్తం 566 పనులు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా అందులో 176 పూర్తి చేశారు. మిగతా 108 కొనసాగుతున్నాయి. మిగిలిన వాటికి టెండర్లు నిర్వహించాలి. ఇంకొన్నింటికీ గుత్తేదారులతో ఒప్పందాలు చేయాల్సి ఉంది. ఈ పనులు త్వరతిగతిన పూర్తి చేసేందుకు వీలుగా వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

పలు శాఖలతో పనుల్లో వేగం
నగరవ్యాప్తంగా అభివృద్ధి పనులను ఒకే శాఖతో కాకుండా ఆ పనులను మిగతా అయిదు శాఖలకు అప్పగించారు. ఏ శాఖకు ఆ శాఖ లక్ష్యం విధించడంతో అత్యధిక పనులు పూర్తి కాగా, మిగతా పనులు ప్రగతిపథంలో ఉన్నాయి. ప్రజారోగ్యశాఖతో పాటు మిగతా నాలుగు శాఖలలో సాంఘిక సంక్షేమ శాఖకు 1-5 డివిజన్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 6-20 డివిజన్లు, 41-50 డివిజన్లు, ఆర్‌ఆండ్‌బీ 21 నుంచి 30 డివిజన్లు, పంచాయతీరాజ్‌ 31 నుంచి 40 వరకు డివిజన్లు ఉన్నాయి.

నిధులు లేక ఆగిన పనులు
ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేస్తుండటంతో అధికారులు సైతం ఎప్పటికప్పుడు టెండర్లు నిర్వహిస్తున్నారు. అత్యధిక చోట్ల సీసీ, తారు రోడ్లు పూర్తికాగా మిగతా ప్రాంతాల్లో పూర్తి చేయాల్సి ఉంది. కొన్నిచోట్ల గుత్తేదారులు తవ్వి వదిలేయడంతో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హౌసింగ్‌బోర్డుకాలనీ, వినాయకనగర్‌, కట్టరాంపూర్‌, అలకాపురి కాలనీ, భగత్‌నగర్‌, రాంచంద్రాపూర్‌ కాలనీ, విద్యానగర్‌, లక్ష్మీనగర్‌, కోతిరాంపూర్‌ ప్రాంతాల్లో రహదారుల పనులు ప్రారంభించి వదిలేశారు. ఈ పనులు పూర్తి చేసేందుకు నిధుల కొరత ఏర్పడింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పిస్తే వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ పనులను వెంటనే పూర్తి చేస్తే ఆయా ప్రాంతవాసులకు సమస్యలు దూరం కానున్నాయి.

వీధుల్లో పకడ్బందీగా పనులు
కొత్తగా వేసిన రహదారులను మళ్లీ తవ్వకుండా ఉండేందుకు భూగర్భ మురుగు కాల్వల పనులు, ఇంటింటా అనుసంధాన పనులు, తాగునీటి పైపులైన్లు వేస్తున్నారు. అవసరమైన చోట బృహత్తర ప్రణాళిక ప్రకారం రహదారి విస్తరణ చేస్తున్నారు. అదేవిధంగా నల్లా కనెక్షన్లు పగిలితే వెంటనే మరమ్మతులు చేయడం వంటి పనులు పూర్తి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి రోడ్డు వేసినా తర్వాత తవ్వడానికి వీల్లేదని, తవ్వితే కేసులు నమోదు చేసేందుకు అధికారులు వెనకడుగు వేయడం లేదు.

మట్టి రోడ్లు.. ఇక సీసీ రహదారులు
ఏళ్ల తరబడి అవస్థలు పడిన పలు డివిజన్ల ప్రజలకు కొత్తగా వేసిన రహదారులతో ఇబ్బందులన్నీ దూరమయ్యాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో మట్టి రోడ్లే దిక్కుగా మారి వర్షాకాలంలో నానావస్థలు పడిన ప్రజలకు సౌకర్యంగా మారింది. ఇన్నాళ్లు నిధుల కొరత కారణంగా శివారు ప్రాంతాల వైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుత ప్రభుత్వం మున్సిపాలిటీల్లో నిధుల కొరతను గుర్తించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో దీర్ఘకాలిక సమస్యలు దూరమయ్యాయి.

మూడు విడతల్లో మంజూరైన పనుల వివరాలు
                      కేటాయింపులు     మొత్తం ప్రారంభించాల్సినవి         నడుస్తున్న           పూర్తయిన
                        పనులు                పనులు                     పనులు              పనులు
* మొదటి విడత           71                       4                        22                 40
* రెండోవిడత              233                      17                      54                  118
* మూడోవిడత             262                     71                       32                   18
* డివిజన్లు : 50
* నిధుల కేటాయింపు : రూ.347.23కోట్లు
* మొత్తం పనులు  : 566
* పూర్తయిన పనులు : 176
* నడుస్తున్న పనులు: 108

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.