close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

నెలాఖరుకల్లా బాధిత కుటుంబాల వివరాలు అందించండి: కలెక్టర్‌ శైనీ

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రజత్‌ కుమార్‌ శైనీ

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఆపద్బంధు, పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసే వారి వివరాలను ఈ నెలఖరు నాటికి అందించాలని కలెక్టర్‌ రజత్‌ కుమార్‌ శైనీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆపద్బంధు, ఓటరు పరిశీలన, కళ్యాణలక్ష్మి, రేషన్‌ కార్డులు, భూ రికార్డుల శుద్ధీకరణ తదితర అంశాలపై ఆయన రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆపద్బంధు, పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాల వారికి అందాల్సిన పరిహారం విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని అన్నారు. ఇందు కోసం వచ్చిన దరఖాస్తులపై తహసీల్దార్లు వెంటనే విచారణ చేపట్టి నిధుల మంజూరుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల్లో మృతి చెందిన వారికి పరిహారం అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్‌ హెచ్చరించారు. 2018 సెప్టెంబరు తర్వాత పిడుగుపాటు వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. పిడుగుపాటుకు మృతి చెందినవారి వివరాలను పోలీస్‌స్టేషన్‌ ద్వారా సేకరించాలన్నారు. కుల, ఆదాయ, నివాస తదితర ధ్రువీకరణ పత్రాలు జారీలో ఎలాంటి జాప్యం తగదని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని పేర్కొన్నారు. మండలాల వారీగా ఇప్పటి వరకు జారీ చేసిన పత్రాల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేషన్‌ కార్డుల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో ద్వారా వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి జిల్లా పౌరసరఫరాల అధికారికి అందజేయాలని చెప్పారు. గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల్లో జరుగుతున్న అసైన్‌మెంట్‌ భూముల ప్రక్రియను సంయుక్త కలెక్టర్‌, ములకలపల్లి మండలంలో ఈ ప్రక్రియను కలెక్టరేట్‌ పరిపాలనాధికారి నాగేశ్వరరావు పర్యవేక్షించాలని ఆదేశించారు.

31వ తేదీలోగా ఓటు నమోదు సవరణలు పూర్తి చేయాలి

ఓటరు పరిశీలన కార్యక్రమం ఈనెల 31వ తేదీతో ముగుస్తున్నందున ఓటు హక్కును పరిశీలించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రజత్‌ కుమార్‌ శైనీ తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఇంకా ఓటు నమోదు చేసుకోని యువతను చైతన్యం చేయాలని సూచించారు. ఓటు వెరిఫికేషన్‌ యాప్‌ సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాలోని ప్రతి ఒక్కరూ వారి ఓటు ఉందో లేదో సరిచూసుకొని మార్పులు, చేర్పులు, సవరణలు చేసుకోవాలని ఆయన అన్నారు. సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, ఆర్డీవో స్వర్ణలత, తహసీల్దార్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.