ఆదివారం, డిసెంబర్ 08, 2019
పటాన్చెరు, న్యూస్‌టుడే: పారిశ్రామిక విధానాల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమీన్పూర్ మండలం పటేల్‌గూడ ఎల్లంకి ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. గురువారం ‘నాన్ డిస్ట్రాక్టివ్ టెస్టింగ్’ అనే అంశంపై కళాశాలలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక ఉత్పత్తుల రంగాల్లో నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. దానికి సాంకేతికత జోడించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ అధ్యాపకుడు రామ్‌జీ, ఛైర్మన్ సదాశివరెడ్డి, దయాకర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు