సోమవారం, డిసెంబర్ 09, 2019
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
బాగ్లింగంపల్లి, న్యూస్టుడే: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం సుందరయ్య కళానిలయంలో బీసీ విద్యార్థుల రాష్ట్ర సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు వసతులు, నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్, ఉపకార వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏడు నెలలుగా హాస్టల్ మెస్ బిల్లులను ప్రభుత్వం చెల్లించక పోవడం శోచనీయమన్నారు. బీసీ విద్యార్థుల ఫీజులన్నీ ప్రభుత్వమే చెల్లించాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు 900 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి అంజి అధ్యక్షత వహించారు. బీసీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు రాంకోఠి, ఓయూ విద్యార్థి నేత శంకర్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకట్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు