close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

ట్రాఫిక్‌పై చిన్నారులకూ అవగాహన

నాగోల్‌లో ఆకట్టుకుంటోన్న పార్కు

నాగోల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, న్యూస్‌టుడే: బాల్యం నుంచే ట్రాఫిక్‌ నిబంధనలపై చిన్నారుల్లో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో రాచకొండ పోలీసులు పిల్లల ట్రాఫిక్‌ పార్కును అందుబాటులోకి తెచ్చారు. నాగోల్‌లో రూ.70లక్షల నిధులతో అత్యాధునికంగా దీనిని రూపొందించారు. హీరో మోటోకార్ప్‌ సంస్థ దీనికి సహకరిస్తోంది. ఇప్పటికే పోలీసు విభాగాలతో కలిసి ‘రైడ్‌ సేఫ్‌’ శిక్షణ కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ పార్కులో రైడింగ్‌ సిమ్యులేటర్లతో పాటు అత్యాధునిక సౌకర్యాలున్నాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు పలు సంస్థల ఉద్యోగులకు సైతం శిక్షణ అందించనున్నారు.

అందరికీ తెలిసేలా..: రోడ్డుప్రమాదాల్లో ఏటా దాదాపు 1.5లక్షల మంది ప్రమాదాల్లో మరణిస్తుండగా, అందులో 45శాతం మంది 35ఏళ్లలోపు యువత ఉండటం గమనార్హం. వారిలోనూ మూడోవంతు పాదచారులే. స్థూల దేశీయోత్పత్తిలో 3శాతం ఆదాయాన్ని రోడ్డుప్రమాదాల వల్లనే నష్టపోవాల్సి వస్తోంది. ప్రతీ ఒక్కరూ మరొకరికి రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ ప్రత్యేక పార్కులో చిన్నారులతో పాటు పెద్దలకూ శిక్షణ ఇవ్వనున్నారు. రెండేళ్లక్రితం నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మూడు తరాలకు చెందిన వ్యక్తులు మరణించడం ప్రతీ ఒక్కరిని ఆవేదనకు గురిచేసింది. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను అధికారులు గుర్తించి మున్సిపల్‌, ఆర్‌ అండ్‌ బీ, జాతీయ రహదారుల సంస్థలతో కలిసి చర్యలు చేపడుతున్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్లు దోహదం చేస్తాయి. ‘‘పాదచారులు, వాహనదారులు నిబంధనలు పాటిస్తూ రోడ్డుప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తపడాలి. పిల్లలూ తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్‌పై మరింత అవగాహన కల్పించాలి. వాహన చోదకులైన పెద్దలు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలి.’’ అని అదనపు డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు.

పార్కుతో అవగాహన ఇలా..: చిన్నారులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ గోడలపై నిబంధనలు సూచించే చిత్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. స్టిమ్యులర్‌ యంత్రాల ద్వారా- డ్రైవింగ్‌ రానివారికి శిక్షణ ఇవ్వడం, చిన్నారులకు సైకిల్‌, మహిళలకు ఎలక్ట్రికల్‌ బైకులు ఉంచడం గమనార్హం. పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఈ పార్కుకు రప్పించి అవగాహన కల్పిస్తున్నారు. నాగోలు ప్రాంతంలో ఏర్పాటు చేసిన భవనంలో క్యాబ్‌డ్రైవర్లు, ఆటోడ్రైవర్లకు సైతం శిబిరాలు  నిర్వహిస్తున్నారు. భావిపౌరులైన చిన్నారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు సాధించగలమన్నదే రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఆలోచన.అనుగుణంగా చిన్నారుల ట్రాఫిక్‌ పార్కును తీర్చిదిద్దారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.